TG: రాష్ట్రంలోని అన్నదాతలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే 23 తర్వాత పెండింగ్ రైతు భరోసా నిధులను రేవంత్ సర్కార్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. డబ్బులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 4 ఎకరాలు ఆపైన ఉన్నవారికి త్వరలోనే పెట్టుబడి సాయం అందనుంది. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.4 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.