అర్హులైన క‌ళాకారుల‌కు ఫించన్లు: మంత్రి జూపల్లి

2చూసినవారు
అర్హులైన క‌ళాకారుల‌కు ఫించన్లు: మంత్రి జూపల్లి
TG: కళాకారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు గుడ్‌న్యూస్ చెప్పారు. శనివారం రవీంద్ర భారతీలో పలువురు కళాకారులు జూపల్లిని కలిసి వారి సమస్యలను వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన కళాకారులకు పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, రాష్ట్రంలో కళాకారులు సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్