తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. 'రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోంది. సంక్షేమం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. రూ.25 వేల కోట్ల రుణమాఫీ చేశాం. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నాం. రాష్ట్ర ప్రజల కలల సాకారానికి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది' అని అన్నారు.