కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసు: KTR

65చూసినవారు
కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసు: KTR
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రయోజనాలు ప్రజలకు తెలుసని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. BJP, కాంగ్రెస్ ఎజెండా ఒక్కటేనని.. KCRను బద్నాం చేయడమే ఆ పార్టీల లక్ష్యమన్నారు. 'మరో దేశంలో కాళేశ్వరం నిర్మించి ఉంటే అది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. కానీ మన దేశంలో మాత్రం కాంగ్రెస్, BJP కుసంస్కారం, కుంచితమైన రాజకీయాలకు పావుగా మారింది. ప్రాజెక్ట్ అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు.. మంత్రివర్గ ఆమోదంతోనే నిర్మాణం జరుగుతుంది' అని చెప్పారు.