ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: బీజేపీ

68చూసినవారు
ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: బీజేపీ
ప్రజలు మార్పును కోరుకుంటున్నారని బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ చెప్పారు. ఎగ్జిట్స్ పోల్స్ అంచనాలను స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. బీజేపీని గెలిపించాలని, మార్పు కావాలని ఢిల్లీ ప్రజలు చాలాకాలం క్రితమే స్థిరనిశ్చయానికి వచ్చారని చెప్పారు. ఆప్‌ అధికారం కోల్పోనుందని, 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీ కైవసం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.

సంబంధిత పోస్ట్