TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణం గాంధీనగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి తాళం వేసిన రెండు ఇళ్లలో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డాడు. తర్వాత పై అంతస్తులోని గది తాళం పగలగొట్టాడు. శబ్దం రావడంతో స్థానికులు దొంగను పట్టుకొని స్థంభానికి కట్టేసి కొట్టి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.