తెలంగాణలో పార్టీ ఫిరాయించిన MLAలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరోసారి సంచలన వ్యాఖలు చేశారు. పార్టీ మారిన 10 మంది MLAల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల విషయంపై తమ న్యాయవాదులను ఇవాళ కలవనున్నట్లు తెలిపారు. ఇంకా త్వరగా చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయని.. ఏ విధంగా ఈ పార్టీ మారిన MLAలపై వేటుపడాలని చర్చిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని KTR తెలిపారు.