గుజరాత్‌లోని ద్వారకలో ఓ ప్రైవేటు కంపెనీలో కూలీగా పనిచేస్తున్న దీపేశ్ గోలీకి ఓ పాకిస్థాన్ నేవీ అధికారితో పేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అతడిచ్చే డబ్బులకు ఆశపడి ద్వారకలోని ఓఖా పోర్టుకు చెందిన రహస్య సమాచారాన్ని, భారత తీర రక్షక దళానికి చెందిన నౌకల కదలికల వీడియోలను అతడికి విక్రయించేవాడు. అలా ఇప్పటి వరకు రూ. 42 వేలు అందుకున్నాడు. ఇటీవల సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ విభాగం దీపేశ్ ను అరెస్ట్ చేసింది.