మసాలాల్లో పెస్టిసైడ్స్.. తోసిపుచ్చిన FSSAI

85చూసినవారు
మసాలాల్లో పెస్టిసైడ్స్.. తోసిపుచ్చిన FSSAI
మసాలా దినుసుల్లో పురుగు మందుల అవశేషాలను అనుమతించినట్లు వచ్చిన వార్తలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఖండించింది. దీనిపై ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అవన్నీ తప్పుడు వార్తలను పేర్కొంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆహార పదార్థాల విషయంలో అత్యంత కఠినమైన ప్రమాణాలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని వయస్సుల వారికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.

ట్యాగ్స్ :