నువ్వులను వేసవి పంటగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని సాగు చేస్తున్నారు. ఈ పంట 85 నుంచి 90 రోజుల్లో చేతికొస్తుంది. ఈ దశలో పంట పూత, కాయలు వచ్చే దశ కాబట్టి నీటి ఎద్దటి లేకుండా చూసుకోవాలి. అయితే, ఈ కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల నువ్వుల పంటకు వివిధ తెగుళ్ల బెడద ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, బూడిద తెగులు కనిపిస్తుంది.