యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపర మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ తొక్కిసలాట కారణంగా 30 మంది మృతి చెందగా, 60 మందికి గాయాలయ్యాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.