ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట

70చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. అప్పటి వరకు హరీశ్ రావును అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్