ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకరరావు మూడోరోజు విచారణ

76చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన  ప్రభాకరరావు మూడోరోజు విచారణ
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు మూడోరోజు విచారణ ముగిసింది. విచారణలో భాగంగా ప్రభాకర్‌రావు ఫోన్లను సిట్ అధికారులు పరిశీలించారు. అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్‌రావు అధికారులకు తెలిపారు. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసని చెప్పినట్లు సమాచారం. తిరిగి ఈ నెల 17న మరోసారి విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్