TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సిట్ ఎదుట మూడోసారి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయనను సిట్ బృందాలు రెండుసార్లు సుదీర్ఘంగా ప్రశ్నించాయి. ఇవాళ మూడో సారి విచారణకు పిలిచింది. కాగా శుక్రవారం ప్రణీత్‌రావును సిట్ అధికారులు విచారించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా ఇవాళ ప్రభాకర్‌రావును ప్రశ్నించనున్నారు. ప్రణీత్‌రావును కూడా ప్రభాకర్‌రావుతో కలిసి ప్రశ్నించే అవకాశం ఉంది.