
ఉగ్రదాడితో మాకు సంబంధం లేదన్న పాక్
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్థాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిస్ స్పష్టం చేశారు. పాక్ టెర్రరిజాన్ని ఎప్పటికీ ప్రోత్సహించదని, తమ దేశాన్ని దూషించడం తగదని భారత్‌ను హెచ్చరించారు. ఈ ఘటనలో తమపై అనవసర ఆరోపణలు చేయడం దురుద్దేశంతో చేసినదిగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, బలూచిస్థాన్ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని, అక్కడి తిరుగుబాట్లే భారత్‌లో అశాంతికి కారణమన్నారు.