PHOTO: ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్

68చూసినవారు
PHOTO: ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. పవన్ రిపోర్ట్స్ పరిశీలించిన అనంతరం వైద్యులు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. అయితే పవన్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్