AP: మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందారు. తాజాగా ఆమె ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి.. అందులోనూ రాణిస్తున్నారు. నైజీరియాలో జరిగిన ‘గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ ఫెస్టివల్’లో అన్షు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ఆ ఫోటోలను అన్షు తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. కాగా, ఇటీవల ఆమె గ్లోబల్ ఎంట్రపెన్యూర్‌షిప్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.