ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు వీరే

61చూసినవారు
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు వీరే
జమ్మూ కాశ్మీర్‌లో పుల్వామా జిల్లా థ్రాల్‌ ప్రాంతంలో నాదిర్ గ్రామంలో గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. జమ్మూకశ్మీర్‌లో 48 గంటల్లో ఎన్‌కౌంటర్‌ జరగడం ఇది రెండోసారి. కాగా, మృతిచెందిన ఉగ్రవాదులు అసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించబడ్డారు. వీరు ముగ్గురు పుల్వామా జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్