లిబియా దేశంలో కుప్పలుగా కుప్పలుగా మృతదేహాలు లభ్యమవడం కలకలం రేపుతోంది. లిబియాలోని రెండవ అతిపెద్ద నగరమైన బెంఘాజీ నుంచి 441 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిఖారా ప్రాంతంలోని ఒక పొలంలో దాదాపు 29 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలు అక్రమ వలసదారులవి అని జిల్లా భద్రతా డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.