విమాన ప్రయాణంలో ఓ చిన్నారి గట్టిగా ఏడవడంతో ఓ ప్రయాణికుడు విసుగెత్తిపోయాడు. అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ప్యాట్ మాకాలిఫ్ ఈ దృశ్యాన్ని వీడియో తీసి, తల్లిదండ్రులపై అసహనం వ్యక్తం చేశాడు. "వాళ్లు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి" అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'బిడ్డ కన్నా నీవే ఎక్కువగా ఏడుస్తున్నావు' అంటూ అతనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.