పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని అంటున్నారు. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె సంబంధింత జబ్బులను తగ్గించడంలో పిస్తా సహాయపడుతుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి కూడా పిస్తా పప్పు దోహదపడుతుందంటున్నారు.