అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. డీఎన్‍ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 31 మృతదేహాలు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో 12 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా మృతదేహాల గుర్తింపుకు 10,000 డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మాజీ సీఎం విజయ్ రుపానీ మృతదేహం గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆస్పత్రి ఏడీఎస్ డా. రజనీశ్ తెలిపారు.