అహ్మదాబాద్ విమాన ప్రమాదం మాటలకందని విషాదమని సినీ నటుడు, MLA నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ ఘటన యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఘోర ప్రమాదంలో భారతీయులతో పాటు విదేశీయులు మృతి చెందడం బాధాకరమన్నారు. విమానం కూలిన చోట మరికొందరు ప్రాణాలు కోల్పోవడం మనసుని కలచివేస్తోందన్నారు. ఈ జాతీయ విపత్తులో ప్రతి ఒక్కరూ కేంద్రానికి బాసటగా నిలుద్దామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.