అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులు, గాయపడినవారి బంధువుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఏఐ-171 ఫ్లైట్‌లో ప్రమాదానికి గురైన ప్రయాణికులు, విమాన సిబ్బంది.. కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఎయిర్ ఇండియా రెండు ప్రత్యేక విమానాలు నడిపించనుంది. ఈ విమానాలు ఢిల్లీ, ముంబై నగరాల నుంచి అహ్మదాబాద్‌కు రాకపోకలు సాగించనున్నాయి.