కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన వెంటనే డిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం విమానం కూలిన స్థలాన్ని అమిత్ షా పరిశీలించారు. అమిత్ షా వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై అమిత్ షా ఆరా తీశారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171, అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే క్రాష్ అయ్యింది.