విమాన ప్రమాదం.. మృతుల శవాలు ఆసుపత్రికి తరలింపు (వీడియో)

59చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌ (AI171) టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో చనిపోయిన వారి శవాలను అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్