అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శిథిలాలను తొలగిస్తుండగా విమానం తోక భాగంలో మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అది విమానంలో విధులు నిర్వర్తించిన ఎయిర్‌హోస్టెస్ మృతదేహం అని అధికారులు వెల్లడించారు. కాగా గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం కాసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే.