అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఒక డిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డీవీఆర్‌లోని సమాచారం దర్యాప్తుకు కీలకం కానుంది. త్వరలో ఫోరెన్సిక్ బృందాలు అక్కడికి వెళ్లనున్నాయని చెప్పారు. విమానాల్లో డీవీఆర్‌లు ఎప్పటికప్పుడు వీడియోలు రికార్డు చేస్తూ ఉండటంతో, ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించడంలో ఇవి ఉపయోగపడతాయని సమాచారం.