అహ్మదాబాద్‌లో BJ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ప్రమాద సమయంలో విద్యార్థులు లంచ్ చేస్తున్న క్యాంటీన్‌లో శకలాలు పడిపోవడంతో, ప్లేట్లతో పాటు రక్తపు మచ్చలతో కూడిన స్థలం వేదన కలిగిస్తోంది. ఫ్లైట్ టైర్లు, శకలాలు భవనంలోకే దూసుకొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.