అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష ఒక్కటే మార్గమని పేర్కొన్న అధికారులు శుక్రవారం నాటికి 231 మృతదేహాలను గుర్తించామన్నారు. వీటిలో 210 మృతదేహాలను వారి కుటుంబీకులకు అందజేసినట్లు తెలిపారు. డీఎన్‌ఏ సరిపోల్చే ప్రక్రియ అత్యంత సున్నితమైందని, వీటిలో చట్టపరమైన అంశాలు ఇమిడి ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు మృతదేహాలు అందించేందుకు తీవ్ర కృషి చేస్తున్నాయన్నారు.