విమాన ప్రమాదం.. ‘కన్నప్ప’ ట్రైలర్ విడుదల వాయిదా

62చూసినవారు
విమాన ప్రమాదం.. ‘కన్నప్ప’ ట్రైలర్ విడుదల వాయిదా
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై స్పందించిన హీరో మంచు విష్ణు, కన్నప్ప ట్రైలర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే రేపు ఇండోర్‌లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. ఈ విషాద సమయంలో సినిమా ప్రచార కార్యక్రమాలు కొనసాగించడం సరికాదని భావించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్