అహ్మదాబాద్‌లోని బీజేఎం కాలేజీ హాస్టల్, స్టాఫ్ క్వార్టర్స్‌పై విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. విమానం ఆ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది మెడికోలు చనిపోగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. హాస్టల్ డైనింగ్ హాల్‌లో ఆహారంతో కూడిన ప్లేట్లు కనిపించాయి. పైకప్పు కూలి వస్తువులు ధ్వంసం అయ్యాయి.