గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై బ్రిటన్ రాజు చార్లెస్-3 దంపతులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "అహ్మదాబాద్‌లో జరిగిన భయంకరమైన సంఘటనతో నేను, నా భార్య తీవ్రంగా షాక్‌కు గురయ్యాము" అని బ్రిటన్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ఉన్నాతెలియజేశారు. ప్రమాదానికి గురైన విమానంలో 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్న విషయం తెలిసిందే.