అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 24 మంది బీజే మెడికల్ కాలేజీ విద్యార్థుల విషాదం మరువలేనిది. నిన్న హాస్టల్ భవనంపైకి విమానం దూసుకెళ్లి పేలిపోయింది. ఆ సమయంలో లంచ్ చేస్తున్న విద్యార్థుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ భవనం ఖాళీ చేసి, విద్యార్థులు తమ లగేజీ తీసుకెళ్లారు. చేతులు, కాళ్లకు కట్లు కట్టుకున్న విద్యార్థుల ఆవేదన కలచివేసింది.