విమాన ప్రమాదం.. తుర్కియేపై అనుమానంగా ఉంది: రామ్‌దేవ్ బాబా

85చూసినవారు
విమాన ప్రమాదం.. తుర్కియేపై అనుమానంగా ఉంది: రామ్‌దేవ్ బాబా
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంపై యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కూలిపోయిన విమానం మెయింటెనెన్స్ తుర్కీకి చెందిన ఓ కంపెనీ చూసుకుంటుందని నాకు తెలిసింది. భారత ప్రభుత్వం ఏవియేషన్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తుర్కీ సంస్థ ఏదైనా కుట్ర చేసే అవకాశం లేకపోలేదు. ఇలాంటి విషయాల్లో విదేశీ కంపెనీలను భాగం చేయకపోవడం మంచిది' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్