అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి తుర్కియే ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 విమానం మెయింటెనెన్స్‌ను తమ దేశానికి చెందిన సంస్థ చూడలేదని స్పష్టం చేసింది. ఎయిరిండియా, తుర్కిష్ టెక్నిక్ మధ్య 2024-25కి గాను ఒప్పందం జరిగిందని పేర్కొంది. అందులో బీ777 విమానానికి మాత్రమే మెయింటెనెన్స్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.