జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో పైలట్ చివరి మాటలకు సంబంధించిన ఓ ఆడియో సందేశం బయటికొచ్చింది. ఎయిరిండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సభ్రావల్.. ‘మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్’ అని మెసేజ్ ఇచ్చారు. కేవలం ఐదు సెకన్ల మెసేజ్ ఇది. ఆ వెంటనే విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది.