అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ఈ ప్రమాదంలో 265 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా తాజాగా ప్రకటించింది. అయితే విమాన ప్రమాద ఘటనపై 6 నెలల క్రితం జ్యోతిష్యురాలు షర్మిష్టా చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది. సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే విమానం కూలిందన్న వార్తలు మనల్ని కలచివేస్తాయి.’ అని ట్వీట్ చేశారు.