అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. అలస్కాలో మూడు రోజుల క్రితం విమానం మిస్సైన ఘటన విషాదాంతంగా మారింది. 10 మంది ప్రయాణికులతో వెళ్లిన విమానం సముద్రంలో భారీ మంచు పలకంపై కూలిపోయింది. విమానంలో ప్రయాణించిన వారంతా మృతి చెందినట్లు అక్కడి అధికారులు శనివారం తెలిపారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.