అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్‌లో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద స్థలంలో నుండి భారీగా నల్లటి పొగలు ఎగసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. వెంటనే స్పందించిన ఎమర్జెన్సీ సర్వీసులు, ఏడు ఫైర్ ఇంజిన్లు రక్షణ చర్యలు కొనసాగిస్తున్నాయి.