ట్రంప్‌నకు విమానం పర్సనల్ గిఫ్ట్ కాదు: ఖతార్‌ ప్రధాని

85చూసినవారు
ట్రంప్‌నకు విమానం పర్సనల్ గిఫ్ట్ కాదు: ఖతార్‌ ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఖతార్‌ ఖరీదైన జెట్ విమానం బహుమతిగా ఇస్తుందన్న వార్తలు రావడంతో వాటిపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ జాసిమ్ అల్-థానీ స్పందించారు. ట్రంప్‌నకు ఇవ్వనున్న విమానం వ్యక్తిగత బహుమతి కాదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఖతార్‌, అమెరికా ప్రభుత్వాల మధ్య జరుగుతున్న అధికారిక లావాదేవీ మాత్రమేనని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్