సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో అప్పుడే పాక్-కివీస్ మ్యాచ్ స్టార్ట్ అయింది. దీంతో బ్యాటింగ్‌కు దిగుదామని కివీస్ ప్లేయర్లు విల్ యంగ్, డెవాన్ కాన్వే సిద్ధమవుతున్నారు. స్టేడియంలోని అభిమానులు మ్యాచ్ ఆరంభం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో హఠాత్తుగా గాల్లో నుంచి ఒక్కసారిగా పలు విమానాలు దూసుకెళ్లాయి. భారీ శబ్దం రావడంతో కివీస్ ఆటగాళ్లు సహా మైదానంలోని ప్రేక్షకులు షాక్ అయ్యారు.