ఉత్తరప్రదేశ్ సంభాల్‌లో వరుడితో పాటు ఐదుగురు మరణించిన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ ద్వారా స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల సాయం అందజేస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రధాని సంతాపం వ్యక్తం చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.