ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఖతార్ షేక్‌కు ప్రధాని మోడీ ఆహ్వానం (వీడియో)

66చూసినవారు
ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి భారత ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలోని ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ స్వయంగా వెళ్లారు. రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం తమీమ్ బిన్ హమద్ అల్-థానీ భారత్ వచ్చారు. అమీర్ మంగళవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, సంస్కృతి వంటి రంగాలతో సహా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్