TG: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత HYD కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఆమె వెంట పలువురు మహిళలు, ఇతర నాయకులు ఉన్నారు. కాగా హైదరాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.