స్కూల్లో విష ప్రయోగం.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు

75చూసినవారు
స్కూల్లో విష ప్రయోగం.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు
TG: ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్మపురికి చెందిన సోయం కిష్టు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుడు సోయం కిష్టు నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఇంట్లో వారిపై కోపంతో నిందితుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్