హీరో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను వెళ్లొద్దు అంటూ ఇదివరకే నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ నిద్ర లేవకపోవడంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ రేవతి మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.