సైకిల్‌పై వెళుతున్న ఓ వృద్ధుడిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ యువకుడికి పోలీసులు సరైన సమాధానం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఇద్దరు యువకులు బైకుపై వెళ్తూ పక్కనే సైకిల్‌పై వెళుతున్న వృద్ధుడి మీద స్ప్రే చల్లారు. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేయగా ఓ యువకుడు నడవలేని స్థితిలో బయటకు రావడం చూడొచ్చు.