దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా 10 వేలమంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 30 దాటిన పార్టీ అధికారం దక్కించుకుంటుంది.