ఎస్‌ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ముగ్గురి కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బిక్కనూరు ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ గంటలపాటు ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు సమాచారం. ముగ్గురూ వాట్సాప్ చాటింగ్‌లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణకు ఎస్పీ సింధు శర్మ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సదాశివనగర్ సీఐ సంతోష్‌ను విచారణ అధికారిగా నియమించారు.